నగల దుకాణంలో చోరీ

ప్రధాన రహదారిపై ఉన్న ఓ బంగారం దుకాణంలోకి దొంగలు చొరబడి రూ.60 వేలు విలువైన సొత్తుతో పాటు అందులోని ట్రంకు పెట్టె (తిజోరీ)ను సైతం ఎత్తుకెళ్లిన ఘటన జోగిపేట పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశం, బాధితులు తెలిపిన వివరాలు.

Updated : 01 Dec 2021 05:53 IST

దుకాణంలోని వస్తువులు చిందరవందర చేసిన దొంగలు

జోగిపేట, న్యూస్‌టుడే: ప్రధాన రహదారిపై ఉన్న ఓ బంగారం దుకాణంలోకి దొంగలు చొరబడి రూ.60 వేలు విలువైన సొత్తుతో పాటు అందులోని ట్రంకు పెట్టె (తిజోరీ)ను సైతం ఎత్తుకెళ్లిన ఘటన జోగిపేట పట్టణంలో చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశం, బాధితులు తెలిపిన వివరాలు..  జోగిపేట పట్టణానికి చెందిన తుపాకుల శేఖర్‌ కొన్నేళ్లుగా పట్టణంలోని ప్రధాన రహదారి సినిమా థియేటర్‌ లైనులో కనకదుర్గ నగల దుకాణం నడుపుతున్నారు. రోజూ మాదిరిగానే సోమవారం రాత్రి దుకాణానికి తాళాలు వేసి ఇంటికెళ్లారు. మంగళవారం ఉదయం దుకాణానికి వెళ్లిన శేఖర్‌ చోరీ జరిగినట్లు గుర్తించి ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు చేరుకుని ఎదురుగా ఉన్న దుకాణం వద్ద ఏర్పాటు చేసి సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ మొదలెట్టారు. దొంగలు అర్ధరాత్రి దాటిన తరువాత తెల్లని కారులో దుకాణం వద్దకు చేరుకుని తాళాలు పగులగొట్టారు. కౌంటర్లో ఉన్న రూ.17 వేలు నగదు, పూజ కోసం వినియోగించే వెండి బిల్లలతోపాటు అక్కడే ఉన్న తిజోరీని కారులో పెట్టుకొని ఉడాయించారు. పుల్కల్‌ మండలంలోని పెద్దరెడ్డిపేట శివారుకు వెళ్లి తిజోరిని పగలగొట్టి అందులోని అర కిలో వెండి వస్తువులు తీసుకుని దానిని అక్కడే వదిలేసి వెళ్లారు. పట్టణంలోని ప్రధాన దారిపై ఉన్న దుకాణంలోనే చోరీ జరగడంతో స్థానిక వ్యాపారులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆ దొంగలు సమీపంలోని మరో దుకాణం తాళాలు పగలగొట్టడానికి యత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. ఆ సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని