Crime News: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి విజయ్‌భాస్కర్‌ హత్య కేసును ఛేదించిన పోలీసులు

రెండు రోజుల కిందట హత్యకు గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్ భాస్కర్ కేసును పోలీసులు ఛేదించారు.

Published : 02 Dec 2021 01:19 IST

హైదరాబాద్‌: రెండు రోజుల కిందట హత్యకు గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్ భాస్కర్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి రియల్ ఎస్టేట్ బ్రోకర్ నరేందర్‌రెడ్డి, అబ్రహాంని తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపారంలో కమిషన్ ఇవ్వకపోవడంతో విజయ్ భాస్కర్‌పై కక్ష పెంచుకున్న నరేందర్ హత్యకు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలో అతను వారం క్రితం నాటు తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ అంజనీ కుమార్‌ మీడియాకు వెల్లడించారు.

సీపీ మాట్లాడుతూ..‘‘విజయ భాస్కర్‌ రెడ్డి, నరేందర్‌ సమీప బంధువులు. స్థిరాస్తి తగాదాలతో విజయ్‌ని చంపాలని నరేందర్‌ కుట్ర పన్నాడు. ఇందుకోసం రూ.30 వేలతో రెండు దేశవాళీ తుపాకులను కొనుగోలు చేశారు. ఇంటి స్థలం ఉంది.. చూడాలని విజయ్‌కు నరేందర్‌ ఫోన్‌ చేశాడు. ఇంట్లో నుంచి విజయ్‌ రూ.9.50 లక్షలతో బయలుదేరాడు. మార్గమధ్యలో నరేందర్‌రెడ్డి విజయ్‌ కారులో ఎక్కాడు. ఆర్టీసీ కాలనీ వైపు తీసుకెళ్లి నాటు తుపాకీతో కాల్చి చంపేశారు. మృతదేహాన్ని కారులో పెట్టుకొని 5 గంటల పాటు తిరుమలగిరి, అల్వాల్ పరిధిలో నరేందర్‌ తిరిగాడు. హత్యకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించిన నరేందర్‌రెడ్డి.. కారులోనే మృతదేహాన్ని వదిలేసి అందులో ఉన్న రూ.9.5లక్షలను తీసుకొని పారిపోయాడు. హత్య అనంతరం విజయ్ భాస్కర్ ఫోన్, నాటు తుపాకీని కొంత దూరంలో నరేందర్‌ పడేసినట్లు పోలీసులు గుర్తించారు. విజయ్‌ భాస్కర్‌ ఫోన్‌ స్విచాఫ్‌ రావడంతో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన తిరుమలగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆర్టీసీ కాలనీలో విజయ్‌ మృతదేశహం లభ్యమైంది. లభ్యమైన సాంకేతిక ఆధారాలతో నరేందర్‌రెడ్డిని అరెస్టు చేశాం’’ అని సీపీ వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు