logo
Published : 03/12/2021 01:15 IST

నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి

సూచనలు చేస్తున్న ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి హరీష్‌, చిత్రంలో అదనపు పాలనాధికారులు రమేశ్‌, ప్రతిమాసింగ్‌, తదితరులు

మెదక్‌, న్యూస్‌టుడే: మెదక్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, అందుకు ప్రతి ఒక్క అధికారి బాధ్యత వహించాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, మెదక్‌ పాలనాధికారి హరీష్‌ సూచించారు. గురువారం మెదక్‌ కలెక్టరేట్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల జోనల్‌, ప్రిసైడింగ్‌, పోలింగ్‌ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనల మేరకు ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోవద్దని, సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారులను సంప్రదించాలన్నారు. ఉమ్మడి జిల్లాలో 1,026 మంది ఓటర్లు ఉన్నారని, వీరి కోసం సంగారెడ్డి జిల్లాలో నాలుగు, మెదక్‌లో మూడు, సిద్దిపేట జిల్లాలో రెండు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి కేంద్రానికి ఒక జోనల్‌, నలుగురు పోలింగ్‌ అధికారులు, సూక్ష్మపరిశీలకులను నియమించినట్లు తెలిపారు. ఈ నెల 9న సామగ్రిని పంపిణీ చేస్తామని చెప్పారు. అంతకుముందు బ్యాలెట్‌ పేపర్‌ పరిశీలన, సామగ్రి స్వీకరణ, కంపార్టుమెంట్ల ఏర్పాటు తదితర అంశాలపై స్వీప్‌ నోడల్‌ అధికారి అవగాహన కల్పించారు. మెదక్‌ జిల్లా అదనపు పాలనాధికారులు ప్రతిమాసింగ్‌, రమేశ్‌, డీఆర్డీవో శ్రీనివాస్‌, డీపీవో తరుణ్‌కుమార్‌, ఏవో యూనస్‌ పాల్గొన్నారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని