సోదరీమణులు.. చిచ్చర పిడుగులు..
ఆడపిల్లల ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతోంది.. యుద్ధవిద్య కరాటే. ఇందులో రాణిస్తూ, పలువురికి శిక్షణ ఇస్తూ తమ సత్తా చాటుతున్నారు ఈ సోదరీమణులు. మెదక్‌కు చెందిన అనసూయ, శ్రీనివాస్‌గౌడ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు అఖిల, మధుప్రియ. చిన్నతనంలోనే ఏర్పడిన ఆసక్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కరాటే నేర్చుకున్నారు. పట్టణంలోని శిక్షకులు నగేష్, దినకర్ వద్ద తర్ఫీదు పొంది మెలకువలు నేర్చుకొని బ్లాక్‌బెల్టులు సాధించారు. 2018లో బోడుప్పల్లో నిర్వహించిన రాష్ట్ర స్ధాయి పోటీల్లో స్పారింగ్లో మధుప్రియ రజతం, అఖిల కటాస్‌లో స్వర్ణ పతకం అందుకున్నారు. 2019లో వెపన్ విభాగంలో అఖిల, కుమితిలో మధుప్రియలు తొలిస్థానాల్లో నిలిచారు. గతేడాదిలో ఇద్దరు బంగారు పతకాలు సాధించారు. ఇక ఈ ఏడాదిలో ఇటీవల జాతీయ స్థాయి పోటీల్లో కుమితి, కటాస్ విభాగాల్లో మొదటి స్థానాల్లో నిలిచి ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సైతం విజేతలుగా ప్రశంసలు అందుకున్నారు. ఇదంతా ఓ వైపు కాగా మరోవైపు పిల్లలకు శిక్షణ ఇస్తూ రాటుదాల్చేందుకు యత్నిస్తున్నారు. నాలుగేళ్లుగా స్థానిక గుల్షన్ క్లబ్లో కరాటే, నాన్చాక్, స్టిక్, సెల్ఫ్ డిఫెన్స్‌లో తర్ఫీదు ఇస్తున్నారు. కరాటేతో తమను ఆము రక్షించుకోగలమన్న నమ్మకం పెరుగుతుందని, నిత్య సాధన ఎంతో అవసరమని చెబుతున్నారీ అక్కాచెల్లెళ్లు.
- న్యూస్‌టుడే, మెదక్ అర్బన్
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.