logo
Published : 03/12/2021 01:15 IST

చికిత్స పొందుతూ ఒకరి మృతి

దుద్దడె శివారులో గత నెల 28న ప్రమాదం
బాధ్యులపై చర్యలకు బాధితుల ఆందోళన

నిరసన తెలిపేందుకు వెళ్తున్న బంధువులను అడ్డుకున్న పోలీసులు

గజ్వేల్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: రాజీవ్‌ రహదారిపై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం సాయంత్రం ప్రజ్ఞాపూర్‌లోని ఏసీపీ కార్యాలయం సమీపంలో మృతదేహంతో ఆందోళన చేపట్టారు. గత నెల 28న రాజీవ్‌ రహదారిపై కొండపాక మండలం దుద్దెడ శివారులో రహదారి పక్కన గజ్వేల్‌ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కారు ఆపి దిగేందుకు డోరు తీశాడు. అదే సమయంలో సిద్దిపేట వైపు నుంచి వస్తున్న మద్దూరు మండలం రేబర్తికి చెందిన అశోక్‌రెడ్డి, అతడి తండ్రి ద్విచక్ర వాహనంపై వస్తూ డోర్‌కు తగిలి కిందపడిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అశోక్‌రెడ్డి (45) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన గజ్వేల్‌ పట్టణానికి చెందిన వ్యక్తి ఇంటి ముందు శవంతో నిరసన తెలిపేందుకు అంబులెన్స్‌లో వస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు ప్రజ్ఞాపూర్‌ వద్ద అడ్డుకున్నారు. దీంతో మృతదేహాన్ని వాహనంలో నుంచి బయటకు తీసి నడుచుకుంటూ వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు కదలబోమని ఆందోళనకు దిగారు. చివరకు పోలీసులు వారికి నచ్చజెప్పి న్యాయం చేసేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని