logo
Published : 03/12/2021 02:47 IST

సాధారణ రైళ్లు సరే.. ప్యాసింజర్లేవి?

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి పేరుతో ప్రత్యేక రైళ్లు నడిపి ప్రయాణికుల నడ్డి విరిచిన దక్షిణ మధ్య రైల్వే.. ఏడాది తర్వాత విమర్శలకు తలొగ్గి వాటిని సాధారణ రైళ్లుగా మార్చింది. ప్యాసింజర్‌ రైళ్లకు మాత్రం మోక్షం లభించలేదు. ప్యాసింజర్‌లో కనీస టికెట్‌ ధర రూ.10కాగా.. ఇప్పుడు వాటినే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా మార్చి.. కనీస టికెట్‌ రూ.30 చేసింది. దీంతో ద.మ.రైల్వే పరిధిలోని నగరాలకు చేరువగా ఉండే పల్లెలు, చిన్న పట్టణాల్లో ఉండి రోజూ రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరం నుంచే రాకపోకలు సాగించే రైల్లు 150 వరకు ఉండేవి. వరంగల్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, తాండూరు, మనోహరాబాద్‌, శంకరపల్లి తదితర ప్రాంతాల నుంచి నగరానికి రాకపోకలు సాగించే చిరువ్యాపారులు, ఉద్యోగులు, వివిధ పనులపై వచ్చేవారు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల ఛార్జీలను చెల్లించుకోవాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు.

ఇంకెన్నాళ్లిలా..
ప్రత్యేక రైళ్లను సాధారణ రైళ్లు చేసి.. అన్నిటిని పట్టాలెక్కించిన ద.మరైల్వే ప్యాసింజర్‌ రైళ్లను ఎందుకు నడపడంలేదంటూ ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. 46 ప్యాసింజర్‌ రైళ్లను పూర్తిగా ఎక్స్‌ప్రెస్‌గా మార్చేసింది. మరో 83 ప్యాసింజర్‌ రైళ్లను అన్‌రిజర్వుడ్‌ ఎక్స్‌ప్రెస్‌లుగా నడుపుతోంది. కరోనాకు ముందు దాదాపు 330 ప్యాసింజర్‌ రైళ్లు నడవగా.. 129 రైళ్లను రకరకాల పేర్లతో ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చారు. మిగతా 200 ప్యాసింజర్‌ రైళ్లను సాధారణ పరిస్థితులు నెలకొన్నా ఇంకా పట్టాలెక్కించలేదు. సికింద్రాబాద్‌-మనోహరాబాద్‌ మధ్య నడిచే 6 మెమూ రైళ్లను శుక్రవారం నడపడం లేదు. మనోహరాబాద్‌-ఉందానగర్‌ మధ్య నడిచే 5 మెమూ రైళ్లు శనివారం రద్దుచేశారు. దీంతో నగరానికి చేరువగా ఉన్న పల్లెలు, పట్టణాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

అన్ని స్టేషన్లలో ఆపాలి
నూర్‌మహ్మద్‌, ప్రధాన కార్యదర్శి, సబర్బన్‌ ప్రయాణికుల సంక్షేమ సంఘం

ప్యాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్సులుగా మార్చడంతో కొన్ని స్టేషన్లలోనే ఆగుతున్నాయి. ఉదాహరణకు సికింద్రాబాద్‌-మనోహరాబాద్‌ మధ్య 14 స్టేషన్లుండగా ఐదు చోట్లే ఆపుతున్నారు. మనోహరాబాద్‌-ఉందానగర్‌ మధ్య నడిచే మెమూ రైళ్ల స్టేజీలు తగ్గిపోయాయి. మనోహరాబాద్‌ నుంచి సీతాఫల్‌మండి వరకూ 5 చోట్లే ఆగుతోంది. ఈ రెండు రైళ్లను మొత్తం స్టేషన్లలో ఆపితే కూరగాయలు, పాల రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది. ప్యాసింజర్‌ టిక్కెట్‌ ధరలే వసూలు చేయాలి.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని