షాద్నగర్లో వ్యక్తి దారుణ హత్య
అక్రమ సంబంధం నేపథ్యంలో ఘటన!
షాద్నగర్ పట్టణం, న్యూస్టుడే: షాద్నగర్ పట్టణంలోని పటేల్రోడ్డులో ఓ వ్యక్తి(35) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఒంటరిగా ఉంటున్న ఓ వృద్ధురాలి(60) ఇంటిలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. గురువారం రాత్రి 7గంటలు దాటిన తరువాత స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై సుందరయ్య వృద్ధురాలిని ప్రశ్నిస్తున్నారు. వృద్ధురాలి కుమారులు వేరే ప్రాంతంలో ఉంటుండగా.. ఆమె ఇంటిలోని కొంత భాగాన్ని అద్దెకు ఇచ్చుకుని జీవిస్తున్నట్లు తెలుస్తోంది. అతను తన ఇంటికి ఎందుకు వచ్చాడో తెలియదని ఆమె చెబుతోంది. అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియలేదు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు.