logo
Published : 03/12/2021 02:47 IST

చిన్నారిని బలిగొన్న మ్యాన్‌హోల్‌ మూత

మృతిచెందిన బాలుడు రహమాన్‌

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: జలమండలి అధికారుల పర్యవేక్షణ లేమి..గుత్తేదారు నిర్లక్ష్యం ఓ చిన్నారిని బలితీసుకొంది. సులేమాన్‌నగర్‌కు చెందిన నిస్సార్‌ అహ్మద్‌, జోహార్‌ దంపతులకు ఆరుగురు సంతానం. అహ్మద్‌ అటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరి ఇంటి సమీపంలో కొంతకాలం క్రితం మ్యాన్‌హోళ్ల పని జరిగింది. మ్యాన్‌హోల్‌పై వేసే మూత(రింగ్‌) ఒకదాన్ని గుత్తేదారు నిస్సార్‌ ఇంటి సమీపంలోని ఓ గోడకు నిలబెట్టాడు. గురువారం మధ్యాహ్నం నిస్సార్‌ చిన్న కుమారుడు అబ్దుల్‌రహమాన్‌(4) బయట ఆడుకుంటూ మ్యాన్‌హోల్‌ రింగు దగ్గరకు వెళ్లాడు. దాన్ని అటూఇటూ ఊపుతూ ఆడుకున్నాడు. సిమెంటుతో తయారు చేసిన బరువైన రింగు ఒక్కసారిగా బాలుడి ఛాతీపై పడింది. ముక్కు, నోటి నుంచి రక్తస్రావం జరిగి చిన్నారి అక్కడికక్కడే మృతిచెందాడు. అప్పటి వరకు సరదాగా ఆడుకున్న చిన్నారి అధికారులు, గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగా మృతి చెందాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుత్తేదారుపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు తెలిపారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని