logo
Published : 03/12/2021 02:47 IST

పరిశ్రమలతో అనుసంధానంగా పరిశోధనలు

ట్రిపుల్‌ ఐటీలో మేధోమధన సదస్సు

ఈనాడు, హైదరాబాద్‌: పరిశ్రమలతో అనుసంధానంగా పరిశోధనలు చేపట్టాలని గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ నిర్ణయించింది. గురువారం వివిధ పరిశ్రమల ప్రతినిధులతో ట్రిపుల్‌ఐటీలో మేధోమదన సదస్సు నిర్వహించారు. పరిశ్రమలతో అనుసంధానంగా పరిశోధనలు చేపట్టే అంశంపై చర్చించారు. విద్యాసంస్థల నుంచి పరిశ్రమల నిర్వాహకులు ఏం కోరుకుంటున్నారు..? ఎలాంటి నైపుణ్యాలున్న విద్యార్థులను ఆశిస్తున్నారు..? ఎలాంటి శిక్షణ ఉంటే ఉద్యోగాలు పొందే వీలుందన్న అంశాలపై విస్తృతంగా ఆలోచనలు పంచుకున్నారు. ఐటీ ఆధారిత పరిశ్రమల అవసరాలకు అవసరమైన కార్యక్రమాలు, కోర్సుల వివరాలను ట్రిపుల్‌ఐటీ నిర్వాహకులు వివరించారు.

మెషిన్‌లెర్నింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
మోడ్రన్‌ మెషిన్‌ లెర్నింగ్‌ ప్రాథమిక కోర్సులో చేరేందుకు విద్యార్థుల నుంచి ట్రిపుల్‌ఐటీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 36 వారాల వ్యవధి ఉన్న కోర్సులో చేరేందుకు ఇంజినీరింగ్‌ చివరి ఏడాదిలో ఉన్న విద్యార్థులు అర్హులు. ట్రిపుల్‌ఐటీలోని ఐహబ్‌ డాటా ఆధ్వర్యంలో వచ్చే జనవరి నుంచి కోర్సును ప్రారంభించనున్నారు. వివరాలకు  https://ihubdata.iiit.ac.in/mml2022 చూడవచ్చని తెలిపింది.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని