logo
Published : 03/12/2021 02:47 IST

హృద్రోగాలతోనే 36 శాతం మరణాలు

తీవ్రమైన ఒత్తిడి, జీవన శైలి మార్పుతోనే సమస్య

సీఎస్‌ఐ వార్షిక సదస్సులో వైద్యనిపుణులు

కార్డియాలాజీ అప్‌డేట్‌ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎస్‌ఐ అధ్యక్షులు పి.పి.మోహనన్‌, డా.దయాసాగర్‌రావు, డా. బెనర్జీ, డా. రఘు

మాదాపూర్‌, న్యూస్‌టుడే: భారతదేశంలో ఏటా జరుగుతున్న మరణాల్లో 36 శాతం మరణాలకు హృద్రోగాలే కారణం. మధుమేహం, రక్తపోటు, పొగతాగటం, జీవనశైలి వంటివి గుండె జబ్బులకు దారితీస్తున్నాయి. గుండె పదిలంగా ఉండాలంటే రోజు కనీసం అరగంట వ్యాయామం తప్పదంటున్నారు వైద్య నిపుణులు. కార్డియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (సీఎస్‌ఐ) 73వ వార్షిక సదస్సు మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో గురువారం ప్రారంభమైంది. ప్రపంచదేశాలకు చెందిన హృద్రోగ వైద్యులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. గుండెకు సంబంధించిన వైద్య విధానంలో వస్తున్న మార్పులు, సవాళ్లు, గుండెజబ్బుల నివారణ వంటి విభిన్న అంశాలపై చర్చించారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి పరిజ్ఞానం వైద్యరంగంలో ఎలాంటి మార్పులకు కారణమైందనే అంశాలపై తమ అనుభవాలను పంచుకున్నారు. భారత్‌లో ఏటా పెరుగుతున్న హృద్రోగుల సంఖ్య, మరణాలపై ఇక్కడి వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు.  


80శాతం నివారించవచ్చు... గుండె జబ్బులకు మధు

- డాక్టర్‌ పి.పి.మోహనన్‌ కార్డియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు
మేహం కూడా ప్రధాన కారణం. ఒకప్పుడు పొగతాగే వారు అధికంగా గుండె జబ్బుల బారినపడే వారు. ఇప్పుడు ఎక్కువ సమయం కూర్చొని పనిచేసే వాళ్లు దీని బారినపడుతున్నారు. భారత్‌లో ఏటా జరుగుతున్న మరణాలకు 36 శాతం హృద్రోగాలే కారణమవుతున్నాయి. గుండె జబ్బులను 80 శాతం నివారించే అవకాశం మన చేతుల్లోనే ఉంది. ఛాతిలో నొప్పి వస్తే వైద్యులను సంప్రదించడం చాలామంచిది.  

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని