Published : 03 Dec 2021 02:47 IST
మరో 25 ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులోకి
ఈనాడు, హైదరాబాద్: జంట నగరాలను కలుపుతూ నడిచే ఎంఎంటీఎస్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే పెంచింది. శుక్రవారం నుంచి మరో 25 సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. కరోనాకు ముందు రోజూ 121 సర్వీసులు నడిచేవి. తర్వాత 56 సర్వీసులను జూన్, జులై నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. గురువారం ప్రకటించిన 25తో మొత్తం అందుబాటులోకి వచ్చిన సర్వీసుల సంఖ్య 81కి చేరింది. తాజాగా ప్రకటించిన వాటిలో 10 సర్వీసులు లింగంపల్లి-సికింద్రాబాద్ మధ్య నడుస్తాయి.
Tags :