logo
Published : 03/12/2021 02:47 IST

మార్చిలో డిజిటల్‌ ఇంటి నంబర్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో డిజిటల్‌ ఇంటి నంబర్ల ప్రాజెక్టు కొలిక్కి వచ్చింది. ఎన్‌ఆర్‌ఎస్‌ఏ(జాతీయ రిమోట్‌ సెన్సింగ్‌ సంస్థ) ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా 2డీ సర్వే పూర్తయింది. జోన్లు, సర్కిళ్లు, డివిజన్లు, ప్రధాన రహదారులు, కాలనీ రోడ్లు, ఇళ్లు, నాలాలు, ఖాళీ స్థలాలు, చెరువులు, కుంటలు, పార్కులు, ఇలా మొత్తం 54 రకాల అంశాలతో గ్రేటర్‌ డిజిటల్‌ పటాన్ని వేర్వేరుగా రూపొందించింది. వాటిని జీహెచ్‌ఎంసీ నగర ప్రణాళిక విభాగం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోంది. రహదారి కూడళ్లు, వీధుల సమాచారంలోని ఖచ్చితత్వాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. మార్చి నాటికి డిజిటల్‌ డోర్‌ నంబర్ల కేటాయింపు ప్రాజెక్టును పూర్తిచేస్తామని ప్రణాళిక విభాగం స్పష్టం చేస్తోంది. అదే సమయంలో.. రాజధానిలో మౌలిక సౌకర్యాలను ప్రపంచస్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగం పునర్‌ వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది.

ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం..

వందల ఏళ్ల నాటి హైదరాబాద్‌లో.. జనావాసాలు ఇష్టానుసారం పెరుగుతున్నాయి. ఎప్పటిలాగే.. జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగం ఇంటి అనుమతులు మంజూరు చేసుకుంటూ, అప్పుడప్పుడు అక్రమ నిర్మాణాలను కూల్చుతూ ముందుకు సాగుతోంది. ఫలితంగా నగరంలో చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. చెరువులు, నాలాలు కనుమరుగవుతున్నాయి. మురుగు, మంచినీటి సరఫరా పైపులైన్లు, వీధి దీపాలు, కాలనీ రహదారుల వ్యవస్థ అధ్వానంగా తయారవుతోంది. వాటన్నింటినీ అదుపుచేస్తూనే.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ బల్దియా ప్రణాళిక విభాగాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో ఐదు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి, వాటికి నగర ప్రణాళికాధికారులు, సహాయ ప్రణాళికాధికారులను కేటాయించారు. ప్రణాళిక విభాగాన్ని ఎప్పట్నుంచో సిబ్బంది కొరవ వేధిస్తోంది. సుమారు 250 మంది ఉద్యోగులను భర్తీ చేయాల్సి ఉంది. నియామకాలు పూర్తయి, ప్రస్తుతం చేపట్టిన పునర్‌వ్యవస్థీకరణ పక్కాగా అమలైతే.. పనితీరు పూర్తిస్థాయిలో మెరుగుపడనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని