logo
Published : 03 Dec 2021 03:16 IST

చిత్ర వార్తలు

మూతి, ముక్కు మూసెయ్యి.. లేదంటే కట్టక తప్పదు రూ.వెయ్యి

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్‌ కరోనా వేరియంట్‌ వేగంగా ఇతర దేశాలకు పాకుతోంది. బెంగళూరులో ఇప్పటికే రెండు కేసులు వెలుగుచూడడంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. నగరంలో కొత్త వేరియంట్‌ కట్టడికి చర్యలు చేపట్టింది. ఇకపై మాస్కుతో మూతి, ముక్కు మూసుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో కన్పిస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.


రాష్ట్రపతి రాక కోసం..

ఏటా నగరంలో దేశ ప్రథమ పౌరుడు శీతాకాల విడిది చేయడం ఆనవాయితీ. ఈసారి ఈ నెల 20వ తేదీ నుంచి బస ప్రారంభం కానుంది. ఇందుకుగాను బొల్లారంలోని రాష్ట్రపతి భవనాన్ని సిద్ధం చేస్తున్నారు.


చదువులమ్మ ఒడిలో చాకిరీ పాఠం!

హయత్‌నగర్‌ మండలం కుంట్లూరు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులే చీపురు పట్టి పాఠశాలలో తరగతి గదుల ఆవరణను శుభ్రం చేసుకుంటున్న చిత్రం గురువారం ఉదయం కనిపించింది.


ఘన సందర్భం.. చరిత స్మరణం!

ఆజాదీకా అమృతోత్సవ్‌లో భాగంగా స్వాతంత్య్ర సంగ్రామంలోని ముఖ్య ఘట్టాలపై అందరికీ అవగాహన కలిగేలా సంబంధిత చిత్రాలతో ఫ్లెక్సీలు మింట్‌ కాంపౌండ్‌ వద్ద గోడ, గేటుకు కట్టారు.


రేయీ పగలు రైతుల సేవలో..

వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందుల్లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం ప్రతాపసింగారంలో కేంద్రం వద్ద రాత్రి 11 గంటల సమయంలోనూ సిబ్బంది తూకం వేస్తూ కనిపించారు.


ఎండీ సారూ.. చూశారా పాట్లు!

సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులు ఎక్కాల్సిందిగా  ఆ సంస్థ ఎండీ సజ్జనార్‌ విస్తృత ప్రచారం సాగిస్తుండగా.. మరోపక్క పైచిత్రం గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సికింద్రాబాద్‌ నుంచి దమ్మాయిగూడ వెళ్లే బస్సులో రద్దీ కారణంగా చోటులేక  ఓ యువకుడు ప్రమాదకరంగా పట్టుకుని వెళ్తున్న ఈ దృశ్యాన్ని పలువురు తమ కెమెరాల్లో చిత్రీకరించారు.

-న్యూస్‌టుడే, లాలాపేట

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఫిర్యాదులు తీసుకోము.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని