logo
Published : 04/12/2021 01:13 IST

పైపుల మరమ్మతుకు కలెక్టర్‌ ఆదేశం


పైపు పగిలిన చోట జేసీబీతో తవ్వకాలు

న్యూస్‌టుడే: పాత తాండూరులో నెలకొన్న దుస్థితిపై ‘జలగరళం..ప్రాణాలు పణం’ శీర్షికన శుక్రవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి జిల్లా పాలనాధికారిణి నిఖిల స్పందించారు. తాండూరు మున్సిపాలిటీ ఇన్‌ఛార్జి కమిషనర్‌, డీఈఈ రంగనాథంతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కలుషిత నీటి సరఫరాకు కారణమవుతున్న పైపులకు  మరమ్మతు చేయాలని ఆదేశించారు. ఆమేరకు అధికారులు పనులు చేపట్టారు. కాగ్నానది నుంచి నీటిని సరఫరా చేసే ప్రధాన పైపుతో పాటు, పట్టణంలో వివిధ కాలనీల్లో మరమ్మతుకు గురైన గొట్టాలను బాగు చేయడం ప్రారంభించారు.ప్రధాన పైపు పగిలిన ప్రదేశాలను తాండూరు తహసీల్దారు చిన్నప్పలనాయుడు పరిశీలించారు. పరిస్థితిని జిల్లా పాలనాధికారిణికి వివరిస్తూ నివేదికను పంపించామన్నారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని