logo
Published : 04/12/2021 02:05 IST

సంక్షిప్త వార్తలు

ప్రయాణికులు బంపర్లపైకి ఎక్కకుండా చూడండి

లాలాపేట, న్యూస్‌టుడే: ప్రయాణికులు ఫుట్‌బోర్డు, బంపర్లపై నిలబడకుండా నిలువరించాలని, అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని బస్సు డ్రైవర్లు, కండక్టర్‌లకు ఆర్టీసీ అధికారులు సూచించారు. సికింద్రాబాద్‌ నుంచి దమ్మాయిగూడ వెళ్తున్న బస్సు బంపర్‌పై ఓ విద్యార్థి నిలబడి ప్రయాణించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన నేపథ్యంలో అధికారులు స్పందించారు. సికింద్రాబాద్‌ రీజినల్‌ మేనేజర్‌ యుగేందర్‌ శుక్రవారం బస్సు డ్రైవర్లు, కండక్టర్‌లకు గేట్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈసీఐఎల్‌ నుంచి దమ్మాయిగూడ రూట్‌లో రాణిగంజ్‌-2, చెంగిచర్ల, కుషాయిగూడ, కాచిగూడ, కంటోన్మెంట్‌ డిపోలకు చెందిన 39 బస్సులు, 109 ఆప్‌, 109 డౌన్‌ ట్రిప్‌లు తిరుగుతున్నాయని తెలిపారు. వీటిలో సికింద్రాబాద్‌ నుంచి 92 ట్రిప్పులు దమ్మాయిగూడకు తిరుగుతాయన్నారు.  


ఆటోడ్రైవర్‌కు గుండెపోటు
వాహనం పక్కకు నిలిపి మృత్యువాత

పంజాగుట్ట, న్యూస్‌టుడే: ఆటో డ్రైవర్‌ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఘటన పంజాగుట్ట ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీలోని జలాల్‌కుంట, హుస్సేనీ ఆలంకు చెందిన ఖలీల్‌ అహ్మద్‌(55) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ప్రయాణికులను తీసుకుని ఖైతరాబాద్‌ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్నాడు. కేసీపీ కూడలి వద్దకు చేరుకోగానే గుండెపోటు వచ్చింది. ఆటోను పక్కకు ఆపి.. అక్కడికక్కడే కుప్పకూలిపోయి మరణించాడు. ఆటోలో ఉన్న వారు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఖలీల్‌ అహ్మద్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.


సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో మైక్రోసాఫ్ట్‌ ఉచిత శిక్షణ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌:  మైక్రోసాఫ్ట్‌ సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా నిర్మాణ్‌ సంస్థ ఆధ్వర్యంలో బీటెక్‌, ఎంటెక్‌(ఐటీ, సీఎస్‌ఈ, ఈసీఈ), బీసీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, బీఎస్సీ కంప్యూటర్స్‌ పూర్తి చేసిన నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందిస్తోంది. నిరుద్యోగ యువతీయువకులకు మూడు నెలలపాటు ఆన్‌లైన్‌లో డాట్‌నెట్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌, స్పోకెన్‌ ఇంగ్లిష్‌,  మాక్‌ ఇంటర్వ్యూ, కెరీర్‌ గైడెన్స్‌, రెస్యూమ్‌ బిల్డింగ్‌, ఐటీలో గెస్ట్‌ లెక్చరర్స్‌, వర్క్‌ప్లేస్‌ రెడీనెస్‌ తదితర కోర్సుల్లో శిక్షణ ఇచ్చి సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సమన్వయకర్త నిరంజన్‌ యాదవ్‌ తెలిపారు. వివరాలకు.. 9100810928.


విద్యార్థి అనుమానాస్పద మృతి

పహాడీషరీఫ్‌, న్యూస్‌టుడే: బడి నుంచి వచ్చిన ఓ విద్యార్థి తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌ కథనం ప్రకారం.. జల్‌పల్లి పురపాలిక సాదత్‌నగర్‌లో ఉండే మొహ్మద్‌ మేరాజ్‌ మూడో కుమారుడు మొహ్మద్‌ షాదాబ్‌(13) 8వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 2న స్కూల్‌ నుంచి ఇంటికి చేరుకుని ఇంట్లో ఒక్కడినే ఉన్నానంటూ పెద్దన్నయ్య అర్బాజ్‌కు ఫోన్‌ చేశాడు. అతను ఇంటికి వచ్చేసరికి షాదాబ్‌ మంచంపై పడిపోయి ఉన్నాడు. చుట్టుపక్కలవారి సాయంతో వెంటనే చాంద్రాయణగుట్టలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని  వైద్యులు తెలిపారు.  బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. మెడకు చున్నీ బిగించి హతమార్చినట్లు అనుమానిస్తున్నారు.


ఓయూలో సాయంత్రం ఎంబీఏ కోర్సులు

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో రెండు సంవత్సరాల సాయంత్రం, మూడు సంవత్సరాల పార్ట్‌టైమ్‌ (సాయంత్రం) ఎంబీఏ కోర్సుల ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే టీఎస్‌ ఐసెట్‌లో అర్హత సాధించిన వారు ఈ ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు ఈనెల 18లోపు దరఖాస్తు చేసుకోవాలి. తరగతులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ఉంటాయి. వివరాలకు 9985560052 నంబర్‌ లేదా ఓయూ వెబ్‌సైట్‌.


తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం రికార్డు

కార్ఖానా, న్యూస్‌టుడే: తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయానికి శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.11,15,822 ఆదాయం సమకూరింది. టీఎస్‌ 10ఎఫ్‌ఏ 9999 నంబర్‌కు  పాకాల నర్సింగ్‌రావ్‌ రూ.6,09,999, టీఎస్‌ 10 ఎఫ్‌బి 0001 నంబర్‌ను హరీష్‌కుమార్‌ రూ.2,45,500లకు ఆన్‌లైల్‌లో  దక్కించుకున్నట్లు ఆర్టీఏ అధికారి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఇతరత్రా కలిపి పైఆదాయం వచ్చిందన్నారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని