logo
Published : 04/12/2021 06:46 IST

జోగిని ఇంట్లో చోరీ.. అల్లుడే నిందితుడు

నారాయణగూడ, న్యూస్‌టుడే:  జోగిని రంగమ్మ ఇంట్లో దోపిడీ కేసును ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. బాధితురాలి దత్తపుత్రిక భర్తే ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి అతడిని అరెస్టు చేశారు. రూ.65 లక్షలు విలువ చేసే 105 తులాల బంగారు ఆభరణాలు, రూ.12 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నగర పోలీసు కమిషనరేట్‌లో తూర్పు మండలం జాయింట్‌ కమిషనర్‌ రమేశ్‌తో కలిసి కమిషనర్‌ అంజనీకుమార్‌ కేసు వివరాలు వెల్లడించారు. ఓయూ క్యాంపస్‌ వద్ద ఉన్న ఎం.కె.నగర్‌లోని ‘వి’ లేన్‌లో ఎస్‌.రంగమ్మ అలియాస్‌ జోగిని రంగమ్మ నివాసం ఉంటున్నారు. నవంబరు 23న ఆమె కాశీ యాత్రకు వెళ్లారు. 29న తిరిగి వచ్చి చూస్తే ఇంట్లో బీరువాలోని  105 తులాల బంగారు వడ్డాణం, పెద్ద గొలుసు, నగదు పోయినట్లుగా గుర్తించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాణాలో ఫిర్యాదు చేశారు. బాధితురాలు దత్తపుత్రిక భర్త, తార్నాక ఎంకె నగర్‌లో ఉంటున్న రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం, ఖానాపూర్‌కు చెందిన పెయింటర్‌ మందాల లక్ష్మణ్‌(29)పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో విచారణ చేపట్టి కేసును కొలిక్కి తెచ్చారు.

వ్యసనాలకు బానిసై..
ఓయూ పోలీసులు ఆర్ట్స్‌ కళాశాల వద్ద మందాల లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. వ్యసనాలకు బానిసై డబ్బుల కోసం దొంగతనాలు చేయాలని భావించి అత్త రంగమ్మ కాశీ వెళ్లిన విషయం తెలుసుకొని చోరీకి పాల్పడ్డాడు. గదిలోని బీరువాలో భద్రపరిచిన ఆభరణాలు, రూ.12లక్షలు చోరీ చేశాడు. నిందితుడిని ఒకటి రెండు రోజుల్లో పోలీసు కస్టడీకి తీసుకొని విచారిస్తామని పోలీసులు తెలిపారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని