logo
Published : 05/12/2021 01:50 IST

ఓఆర్‌ఆర్‌పై లారీని ఢీకొట్టిన కారు

మంటలు చెలరేగి రెండు వాహనాలు దగ్ధం

దగ్ధమవుతున్న కారు, లారీ

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: అవుటర్‌ రింగ్‌ రోడ్డుపై లారీని కారు ఢీకొనడంతో చెలరేగిన మంటల్లో రెండు వాహనాలూ దగ్ధమయ్యాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌ సీఐ వి.స్వామి కథనం ప్రకారం.. శనివారం తెల్లవారు జామున 2.30కు సూర్యాపేట నుంచి ఘట్‌కేసర్‌లోని రాంపల్లికి వెళుతున్న సిమెంట్‌ లారీ పెద్దఅంబర్‌పేట్‌ వద్ద ఓఆర్‌ఆర్‌ ఎక్కి ఘట్‌కేసర్‌ వైపునకు వెళుతోంది. నాగారం బాబురెడ్డికాలనీకి చెందిన నయని మయూర్‌ శంషాబాద్‌ వైపు నుంచి వస్తూ కారుతో లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు. మంటలు చెలరేగి క్షణాల్లో కారును, లారీని చుట్టుముట్టాయి. ఇతర వాహనదారులు లారీ డ్రైవర్‌ను హెచ్చరించడంతోపాటు గాయపడిన నయని మయూర్‌ను బయటకు తీశారు. హయత్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. మయూర్‌ కారుపై 3 ట్రాఫిక్‌ చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని