logo

44 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 44 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, ‘టెట్‌’ పరీక్ష నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య

Published : 05 Dec 2021 01:50 IST
విద్యా శాఖ మంత్రి కార్యాలయం ముందు నినాదాలు చేస్తున్న ఆర్‌.కృష్ణయ్య తదితరులు

బషీర్‌బాగ్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 44 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, ‘టెట్‌’ పరీక్ష నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్‌లోని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించారు. తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఛైర్మన్‌ నీల వెంకటేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎల్‌బీ స్టేడియం నుంచి నిరుద్యోగులు భారీ ప్రదర్శనగా తరలివచ్చి మంత్రి కార్యాలయం ముందు బైఠాయించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్‌ గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు