logo

మానవ హక్కులపై అవగాహన కల్పించాలి

మానవ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కృషి జరగాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య అన్నారు. మానవ హక్కులపై అనేక చట్టాలు ఉన్నా

Published : 05 Dec 2021 01:50 IST
మాట్లాడుతున్న జస్టిస్‌ చంద్రయ్య. చిత్రంలో ప్రొ.విష్ణుప్రియ, ప్రొ.కృష్ణ, సురేంద్రలూనియా,
డా.గాలి వినోద్‌కుమార్‌, డా.వెంకటేశ్వర్లు

కాచిగూడ, న్యూస్‌టుడే: మానవ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కృషి జరగాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య అన్నారు. మానవ హక్కులపై అనేక చట్టాలు ఉన్నా అమలులో నీరుగారుస్తున్నారని వాపోయారు. శనివారం చాదర్‌ఘాట్‌ చౌరస్తాలోని మార్వాడి శిక్షా సమితి న్యాయవిద్య కళాశాల ఆధ్వర్యంలో ‘మహిళా హక్కులు మానవ హక్కులే’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మహిళా హక్కులు అసాధారణమైనవని, వాటిని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఉస్మానియా న్యాయ కళాశాల డీన్‌ డాక్టర్‌ గాలి వినోద్‌కుమార్‌, న్యాయశాఖాధిపతి డాక్టర్‌ వెంకటేశ్వర్లు, సురేంద్రలూనియా, ఎస్‌పీ కాబ్రా, ప్రొఫెసర్‌ డీవీజీ కృష్ణ, ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ విష్ణుప్రియ, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మహమ్మద్‌ ఆదిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని