logo

రద్దీ నియంత్రణకు కూడళ్ల విస్తరణ

మహానగరంలో రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో కూడళ్ల వద్ద సిగ్నల్‌ పడితే బారులు తీరాల్సిన పరిస్థితి. దీనికి పరిష్కారంగా పోలీసు శాఖ సూచనల మేరకు నగరవ్యాప్తంగా 90 కూడళ్లను అభివృద్ధి చేస్తోంది

Published : 06 Dec 2021 03:11 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: మహానగరంలో రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో కూడళ్ల వద్ద సిగ్నల్‌ పడితే బారులు తీరాల్సిన పరిస్థితి. దీనికి పరిష్కారంగా పోలీసు శాఖ సూచనల మేరకు నగరవ్యాప్తంగా 90 కూడళ్లను అభివృద్ధి చేస్తోంది మహానగర పాలక సంస్థ. విస్తరణ బాధ్యతను జోనల్‌ కమిషనర్లకు అప్పగించి, అవసరమైన నిధులను విడుదల చేస్తున్నట్లు ఆదివారం బల్దియా ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే 69 కూడళ్లు పూర్తికాగా మిగతా 11 పనులు పురోగతిలో ఉన్నాయని.. మరో 10 చోట్ల త్వరలో పనులు మొదలవుతాయని పేర్కొంది.

ఖైరతాబాద్‌లో అత్యధికం  

అత్యధికంగా ఖైరతాబాద్‌ జోన్‌లో 34 కూడళ్లను విస్తరించాలని ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే 22 పూర్తి కాగా.. ఐదు పురోగతిలో ఉన్నాయని, మరో 7 మొదలు కాబోతున్నాయన్నారు. చార్మినార్‌ జోన్‌లో 9కి గాను 7 పూర్తయ్యాయని, శేరిలింగంపల్లిలో 11కు 7 పూర్తయి, ఒకటి పురోగతిలో ఉందని, కూకట్‌పల్లిలో 10లో 9 పూర్తయ్యాయని.. సికింద్రాబాద్‌లో 15లో 13 చోట్ల పనులు పూర్తి కావస్తున్నాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని