Published : 06 Dec 2021 04:23 IST
గోశాలలకుచేయూత అందించాలి
మంత్రి తలసానికి జ్ఞాపిక అందజేస్తున్న స్వామి స్వయం భగవాన్‌దాస్, జస్మత్‌పటేల్
కాచిగూడ, న్యూస్‌టుడే: గ్రేటర్ పరిధిలోని గోశాలలకు ప్రభుత్వపరంగా ఆర్థిక చేయూత అందించాలని తెలంగాణ గోసంరక్షణ సంస్థలు కోరాయి. 40 గోశాలల్లో 30 వేల గోవులు ఉన్నాయని, వాటి నిర్వహణ కష్టమవుతోందని పేర్కొన్నాయి. ఆదివారం కాచిగూడలోని తెలంగాణ లవ్‌ఫర్‌కౌ ఫౌండేషన్ ఛైర్మన్ జస్మత్‌పటేల్, ప్రాణిమిత్ర రమేశ్ జాగిర్దార్ మెమోరియల్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి రితీశ్ జాగిర్దార్, తెలంగాణ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు సభ్యుడు స్వామి స్వయం భగవాన్‌దాస్, గోసంరక్షణ ఉద్యమకారుడు రమేశ్ తివారి తదితరులు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, డైరెక్టర్ ఎస్.రామచంద్రలను మారేడుపల్లిలోని నివాసంలో జ్ఞాపికతో సన్మానించి విజ్ఞప్తి చేశారు.
Tags :