logo

నర్సరీల నిర్వహణ.. మొక్కల సంరక్షణ

పచ్చదనాల పెంపు, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం హరితహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. మరింత పక్కాగా అమలు చేసి గ్రామ, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన వాతావరణం

Published : 07 Dec 2021 01:22 IST

న్యూస్‌టుడే, పాత తాండూరు

మట్టి సంచులను సిద్ధం చేస్తున్న సిబ్బంది

చ్చదనాల పెంపు, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం హరితహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. మరింత పక్కాగా అమలు చేసి గ్రామ, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన వాతావరణం కల్పించాలన్నది లక్ష్యం. ఈ ఉద్దేశంతో నర్సరీల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ప్రతి పంచాయతీకి ఒకటి ఏర్పాటు చేయించి వాటిల్లో 15వేల మొక్కలను సిద్ధం చేయించి వచ్చే వర్షాకాలంలో నాటించేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. గతం కంటే ఈసారి సంఖ్యను పెంచారు. ఈ నేపథ్యంలోనే పల్లెల్లో నర్సరీల నిర్వహణ ఊపందుకుంది. ఈ వివరాలతో ‘న్యూస్‌టుడే’ కథనం.

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది కొత్తగా 83.85లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈమేరకు ప్రతి నర్సరీలో మొక్కలు చక్కగా ఎదిగేలా ఎర్రమట్టిని సేకరించి ప్లాస్టిక్‌ సంచుల్లో బెడ్లను సిద్ధం చేస్తున్నారు. నర్సరీలో పనులు చేసేందుకు ఉపాధి హామీ కూలీలను వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగితేనే వర్షాకాలం నాటికి ఎదిగిన పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. సర్పంచులు, కార్యదర్శులు నిర్వహణ బాధ్యత చూసుకుంటుండగా, మండలాల్లోని క్షేత్రసహాయకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు.

కోరిన వాటికే ప్రాధాన్యం..: గ్రామాల వారీగా రైతులు, ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తులు కోరిన వాటినే నర్సరీల్లో మొక్కలను పెంచేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని నర్సరీల్లో మట్టి సేకరించే పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే.. ఏ మొక్కలు ఎన్ని అవసరమో, ఆ ప్రకారం విత్తన రకాలను వేసి పెంచాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

పాత వాటిని మార్చి: గతేడాది వర్షాకాలంలో నాటగా మిగిలిపోయిన మొక్కలను పెద్ద ప్యాకెట్లలోకి మార్పు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో అన్ని నర్సరీల్లో కలిపి 2.23 లక్షల మొక్కలున్నాయి. ఇప్పటి వరకు 1.99 మొక్కలను పెద్ద ప్యాకెట్లలోకి మార్పు చేయగా, ఇంకా 24వేలను మార్చాల్సి ఉంది. కొందరు రైతులు తీసుకెళ్లి పొలాల వద్ద నాటుకుంటున్నారు.

ప్రభుత్వ స్థలాల్లోకే..: గతంలో నర్సరీల నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి, స్థలం, నీటికి ప్రతి ఏడాది అద్దెరూపంలో నగదు చెల్లించేవారు. ప్రస్తుతం ప్రభుత్వ స్థలంలోకి మార్చి పంచాయతీ ట్యాంకరు ద్వారా నీటిని అందించాలని నిర్ణయించారు. ఇలా 234 నర్సరీలను ప్రభుత్వ స్థలాల్లోకి మార్చారు. స్థలాల కొరత, ఇతర కారణాల వల్ల ఇంకా 332 నర్సరీల్లో ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.

అటవీశాఖ అధికారులు గతంలో నాటినవి ప్రస్తుతం ఇలా..


అవసరమైన వాటినే అందజేస్తాం
స్టీవెన్‌ నిల్‌, అదనపు ప్రాజెక్టు అధికారి

ప్రస్తుతం నర్సరీల్లో మట్టి సేకరణ, ప్లాస్టిక్‌ సంచులు నింపే ప్రక్రియ కొనసాగుతోంది. అనంతరం క్షేత్రస్థాయిలో కోరిన విత్తనాలను సేకరించి మొక్కలను పెంచనున్నాం. వర్షాకాలం నాటికి అన్ని నర్సరీల్లో 15వేల మొక్కల లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలనే పనులు ముమ్మరంగా చేయిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని