logo

అడ్డగించి.. నిలువు దోపిడీ..

అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ ప్రయాణికుడిని అడ్డగించి, దుండగులు నిలువు దోపిడీ చేసిన సంఘటన కొమురవెల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. కొమురవెల్లి ఎస్సై

Published : 07 Dec 2021 01:22 IST

చేర్యాల, న్యూస్‌టుడే: అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ ప్రయాణికుడిని అడ్డగించి, దుండగులు నిలువు దోపిడీ చేసిన సంఘటన కొమురవెల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. కొమురవెల్లి ఎస్సై చంద్రమోహన్‌ తెలిపిన వివరాలు.. మద్దూరు మండలం వల్లపట్ల గ్రామానికి చెందిన గాజుల వేణుగోపాల్‌ ద్విచక్ర వాహనంపై ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్‌ వెళ్తున్నాడు. 12.30 గంటలకు కొమురవెల్లి శివారు గోశాల వద్దకు రాగానే ద్విచక్ర వాహనాలపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని అడ్డగించారు. వేణుగోపాల్‌ చెంపపై కొట్టి భయభ్రాంతులకు గురిచేసి అతని వద్ద ఉన్న రూ.12,300 నగదు, 10 గ్రాముల బంగారు ఉంగరం, చరవాణి లాక్కొని కిష్టంపేట వైపు వెళ్లిపోయారు. బాధితుడు సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని