logo

ఆరోగ్యవంత రాష్ట్రం కోసం ‘హరితహారం’

ఆరోగ్యవంతమైన, నివాసయోగ్యమైన ప్రాంతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘హరిత హారం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. జోగినపల్లి సంతోష్‌కుమార్‌

Published : 07 Dec 2021 02:39 IST

ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించిన మంత్రులు  జగదీష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు

రవీంద్రభార[తి, న్యూస్‌టుడే: ఆరోగ్యవంతమైన, నివాసయోగ్యమైన ప్రాంతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘హరిత హారం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. జోగినపల్లి సంతోష్‌కుమార్‌ జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి రవీంద్రభారతిలో ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించారు.  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఉద్యమం గురించి వివరించారు. టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు. పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, బీసీ కమిషన్‌ సభ్యులు కిషోర్‌గౌడ్‌, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ,. సాట్స్‌ ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని