logo

Crime News: వీసా ఖర్చులకు గంజాయి రవాణా

దుబాయి వెళ్లేందుకు సిద్ధమైన ఓ వ్యక్తి వీసా ఖర్చుల కోసం మరో మహిళతో కలిసి గంజాయిని రవాణా చేస్తూ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. సికింద్రాబాద్‌ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీను, ఎస్‌ఐ మజీద్‌ల కథనం ప్రకారం..

Updated : 07 Dec 2021 08:05 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: దుబాయి వెళ్లేందుకు సిద్ధమైన ఓ వ్యక్తి వీసా ఖర్చుల కోసం మరో మహిళతో కలిసి గంజాయిని రవాణా చేస్తూ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. సికింద్రాబాద్‌ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీను, ఎస్‌ఐ మజీద్‌ల కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం గణపతి జిల్లాకు చెందిన రాజీవ్‌ మాఝీ(29) స్థానికంగా కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడు దుబాయికి వెళ్లేందుకు సిద్ధమై వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. ఏజెంట్‌కు రూ.30వేలు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలోనే బరంపూర్‌లో గంజాయి సరఫరా, విక్రయాలు చేపట్టే మహారాష్ట్ర సోలాపూర్‌ జిల్లా వాసి సురేఖ లక్ష్మణ్‌ కాలే(60) అతడికి పరిచయమైంది. ఆమె సూచనతో గంజాయి రవాణాకు సిద్ధమయ్యాడు. వీరిద్దరు 38కిలోల గంజాయితో ఈ నెల5న ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఉండగా సికింద్రాబాద్‌ స్టేషన్‌లో అరెస్టు చేసి సోమవారం రిమాండుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని