logo

ప్రతి సంక్షోభంలోనూ కొత్త అవకాశం

నైపుణ్యం కలిగిన కార్పొరేట్‌ మేనేజర్లు, వ్యవస్థాపకులు, విద్యావేత్తలకు శిక్షణ ఇవ్వడంలో అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా(ఆస్కీ)ది గొప్ప చరిత్ర అని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై అన్నారు. ఆస్కీ 65వ వ్యవస్థాపక దినోత్సవం

Published : 07 Dec 2021 02:38 IST

ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడుతున్న గవర్నర్‌ తమిళిసై

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: నైపుణ్యం కలిగిన కార్పొరేట్‌ మేనేజర్లు, వ్యవస్థాపకులు, విద్యావేత్తలకు శిక్షణ ఇవ్వడంలో అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా(ఆస్కీ)ది గొప్ప చరిత్ర అని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై అన్నారు. ఆస్కీ 65వ వ్యవస్థాపక దినోత్సవం సోమవారం సోమాజిగూడలోని బెల్లవిస్టాలో నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ వర్చువల్‌ విధానంలో ప్రసంగించారు. ఆస్కీ దేశంలోనే అత్యుత్తమ మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థ అని కొనియాడారు. కొవిడ్‌-19 ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలను ప్రభావితం చేసిందని, ప్రధానంగా వైద్య ఆరోగ్య రంగం ఒత్తిడికి గురైందన్నారు. కొత్త వేరియంట్‌ ఓమ్రికాన్‌ను ఎదుర్కొనేందుకు అనేక దేశాలు కృషిచేస్తున్నాయని, ప్రతి సంక్షోభం కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. అనంతరం సంస్థలో 25 ఏళ్లు పూర్తిచేసుకున్న పలువురిని ఛైర్మన్‌ పద్మనాభయ్య జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆస్కీ డైరెక్టర్‌ జనరల్‌ ప్రొ.నిర్మల్య బాగిచ, రిజిస్ట్రార్‌ కల్యాణ్‌ రాయ్‌, ఆస్కీ కోర్ట్‌ ఆఫ్‌ గవర్నర్లు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని