logo

ఒమిక్రాన్‌ నియంత్రణపై రంగంలోకి జీహెచ్‌ఎంసీ

రాజధాని పరిధిలో రోజురోజుకూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. దేశంలోని పలు నగరాల్లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులూ నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌

Published : 07 Dec 2021 02:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాజధాని పరిధిలో రోజురోజుకూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. దేశంలోని పలు నగరాల్లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులూ నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) యంత్రాంగం మహమ్మారి కట్టడి చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న ఇళ్లు, వీధులు, కాలనీలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, ఇతర ప్రాంతాల్లో అవసరమైన చర్యలు చేపట్టేలా అధికారులు దృష్టి సారించారు. దీనిలోభాగంగా.. ముందస్తుగా ఆయా చోట్ల సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నామని దోమల నివారణ విభాగం తెలిపింది. అలాగే, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ముమ్మరం చేసి, ఇప్పటివరకు టీకా వేయించుకోని వారికి ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించింది. మున్ముందు కేసులు మరింతగా పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ అధికారులతో నిత్యం సమీక్షిస్తున్నారని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని