logo

తిరిగొస్తున్నామని.. తిరిగిరాని లోకాలకు!

ఇప్పుడే వస్తామంటూ చెప్పి వెళ్లిన అమ్మానాన్నలు ఇంకా రాలేదంటూ పిల్లలు అడుగుతుంటే ఏం చెప్పాలో బంధువులకు అర్థం కావట్లేదు. అప్పటి వరకూ తమతో ఉండి వెళ్లిన స్నేహితురాలు ఇకలేదని తెలిసి పొదుపు సంఘం

Published : 07 Dec 2021 02:38 IST

రాయదుర్గం, న్యూస్‌టుడే: ఇప్పుడే వస్తామంటూ చెప్పి వెళ్లిన అమ్మానాన్నలు ఇంకా రాలేదంటూ పిల్లలు అడుగుతుంటే ఏం చెప్పాలో బంధువులకు అర్థం కావట్లేదు. అప్పటి వరకూ తమతో ఉండి వెళ్లిన స్నేహితురాలు ఇకలేదని తెలిసి పొదుపు సంఘం మహిళలు కన్నీరు మున్నీరవుతున్నారు. గండిపేట్‌ సమీపంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్గంరాజు, మౌనిక దంపతులు అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలను కాంటినెంటల్‌ ఆసుపత్రికి తరలించటంతో బంధువులు, గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. ఆత్మీయల రోదనతో ప్రాంగణం మిన్నంటింది.

ముచ్చటైన సంసారం..
కోకాపేటకు చెందిన రాజు స్థానికంగా పాల ప్యాకెట్లు, దినపత్రికలు వేస్తుంటారు. మౌనిక నార్సింగి మున్సిపాలిటీ రిసోర్స్‌ పర్సన్‌గా పనిచేస్తున్నారు. ఆరో తరగతి చదువుతున్న చంద్రిక, రెండో తరగతి చదువుతున్న అనీష్‌, రెండేళ్ల మనీష్‌ సంతానం. మౌనిక పదేళ్లుగా ఆర్పీగా పనిచేస్తోంది. గ్రామపంచాయతీగా ఉన్నపుడు ఆమె వీఓఎల్‌ (విలేజ్‌ ఆర్గనైజ్‌ అసిస్టెంట్‌)గా పనిచేసేదని, మున్సిపాలిటీగా మారాక రిసోర్స్‌ పర్నన్‌(ఆర్పీ)గా గుర్తించారు. సోమవారం ఉదయం 11 గంటలకు దంపతులు బైకుపై వెళ్లగా అరగంట వ్యవధిలోనే ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందినట్టు తెలిసిందంటూ తోటి ఉద్యోగులు కన్నీరు పెట్టుకున్నారు.  

ప్రమాదం జరగ్గానే పరారీ.. ప్రమాదానికి కారణమైన సంజయ్‌ది శంకర్‌పల్లి మండలం మోకిల. ఉదయమే స్నేహితులతో కలసి మద్యం తాగి మత్తులో తూలుతూనే బంధువులతో కలిసి వాహనం నడుపుతూ బయల్దేరాడు. ప్రమాదం జరిగిన వెంటనే పరారై తర్వాత లొంగిపోయాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని