logo

పరిగిలో పట్టపగలే చోరీ

పట్టపగలే ఇంట్లోకి చొరబడి బీరువా పగులగొట్టి బంగారం, నగదు చోరీ చేసిన సంఘటన ఇది. పరిగి పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు గంటల

Published : 08 Dec 2021 00:51 IST

నేరస్థురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

పరిగి గ్రామీణ, న్యూస్‌టుడే: పట్టపగలే ఇంట్లోకి చొరబడి బీరువా పగులగొట్టి బంగారం, నగదు చోరీ చేసిన సంఘటన ఇది. పరిగి పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే మహిళా నేరస్థురాలిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కొడంగల్‌ సీఐ అప్పయ్య తెలిపిన వివరాల ప్రకారం... మంజుల అలియాస్‌ ఫాతీమా పాత నేరస్థురాలు. పరిగి పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో నివాసం ఉంటున్న ఎలక్ట్రీషియన్‌ నర్సింలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడింది. బీరువాలోని 4.9 తులాల బంగారు ఆభరణాలతో పాటు, రూ.1.50 లక్షల నగదును చోరీ చేసి పరారైంది. విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాలనీలో అమర్చిన సీసీ కెమెరాల ఆధారంగా పాతనేరస్థురాలే చోరీకి పాల్పడినట్లుగా గుర్తించారు. పట్టణం నుంచి పారిపోకుండా  బందోబస్తును కట్టుదిట్టం చేశారు. ఎట్టకేలకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆభరణాలను, నగదును స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని