logo

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

పోషకాహార పంపిణీని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిణి లలితకుమారి అంగన్‌వాడీ టీచర్లకు సూచించారు. మంగళవారం స్థానిక రైతు వేదికలో మర్పల్లి ప్రాజెక్టు

Published : 08 Dec 2021 00:51 IST


సమావేశంలో మాట్లాడుతున్న అధికారిణి లలితకుమారి

మోమిన్‌పేట, న్యూస్‌టుడే: పోషకాహార పంపిణీని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిణి లలితకుమారి అంగన్‌వాడీ టీచర్లకు సూచించారు. మంగళవారం స్థానిక రైతు వేదికలో మర్పల్లి ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కేంద్రానికి హాజరవుతున్న చిన్నారుల బరువును ప్రతిదినం కొలత వేయాలన్నారు. పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించి వారి ఎదుగుదలకు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి అవగాహన కల్పించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలని పర్యవేక్షణాధికారులకు సూచించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు లింగమణి, జ్యోతి, తులసమ్మ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని