logo

చిత్ర వార్తలు

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులకు మంగళవారం సరూర్‌నగర్‌ మైదానంలో ‘4వ వార్షిక స్పోర్ట్స్‌, గేమ్స్‌ మీట్‌ 2021’ ప్రారంభమైంది. నాలుగు రోజులపాటు 35 క్రీడాంశాల్లో జరగనున్న పోటీలను హోంశాఖ కార్యదర్శి

Published : 08 Dec 2021 03:07 IST

పోలీసుల పోటీలు

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులకు మంగళవారం సరూర్‌నగర్‌ మైదానంలో ‘4వ వార్షిక స్పోర్ట్స్‌, గేమ్స్‌ మీట్‌ 2021’ ప్రారంభమైంది. నాలుగు రోజులపాటు 35 క్రీడాంశాల్లో జరగనున్న పోటీలను హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా ప్రారంభించారు. కమిషనర్‌ మహేష్‌ భగవత్‌,  డీసీపీలు రక్షిత కె మూర్తి, యాదగిరి, నారాయణరెడ్డి, శిల్పవల్లి పాల్గొన్నారు.

-న్యూస్‌టుడే, సరూర్‌నగర్‌


చిన్నారులకేం తెలుసు ఇది నిలోఫర్‌ అని..

చిన్నపిల్లల వైద్య సేవలకు పేరున్న నిలోఫర్‌కు పరిమితికి మించి వస్తుండడంతో సరిపడినన్ని సౌకర్యాలు లేక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. మంగళవారం ఇద్దరు అప్పుడే పుట్టిన పసికందులను అత్యవసర వైద్యం కోసం వేరే ఆసుపత్రుల నుంచి తీసుకువచ్చారు. స్ట్రెచర్లు అందుబాటులో లేక ఒకే దానిపై ఇద్దర్ని ఆక్సిజన్‌ పెట్టి లోనికి తీసుకెళ్లారు.


సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు సినీ సాహిత్యానికి తీరని లోటని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ పేర్కొన్నారు. శ్రీనగర్‌కాలనీలో ఆయన నివాసానికి మంగళవారం వచ్చిన గవర్నర్‌ సిరివెన్నెల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

టీవల కన్నుమూసిన ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య కుటుంబ సభ్యులను కూడా గవర్నర్‌ పరామర్శించారు. అమీర్‌పేట ధరమ్‌కరమ్‌ రోడ్డులోని ఆయన నివాసానికి వెళ్లి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా ఆయన చేసిన సేవలు గుర్తుచేసుకున్నారు.

-శ్రీనగర్‌కాలనీ, సంజీవరెడ్డినగర్‌, న్యూస్‌టుడే


ఎదిగిన కొద్దీ నీడనిస్తూ..!

ళ్ల నాటి మర్రి వృక్షాల కొమ్మలు, ఊడలు భారీగా వ్యాపించి పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. సందర్శకులు ఇక్కడ సేదతీరడంతో పాటు కొమ్మలపై ఎక్కి సంతోషంగా గడుపుతున్నారు. కీసర గుట్ట ఆలయ సమీపంలోని పార్కులో కనిపించిందీ సుందర దృశ్యం


చరవాణుల పంపిణీ

హిళా స్త్రీ సంక్షేమ శాఖ ద్వారా నియోజకవర్గంలోని 279 అంగన్‌వాడీ కేంద్రాల ఉపాధ్యాయినులకు రూ.28లక్షల విలువజేసే చరవాణులను సీడీపీఓ రేణుక మంగళవారం అందజేశారు. తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండలాల్లోని సిబ్బందికి నాలుగు రోజుల్లో పంపిణీ చేస్తామన్నారు.

- న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని