logo
Published : 08/12/2021 03:07 IST

ఓయూ ఆచార్యులపై నిఘా!

వీసీ నిర్ణయంపై మండిపడుతున్న అధ్యాపక సంఘాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర సిబ్బంది పనితీరు సహా వివిధ అంశాలపై నిఘా పెట్టాలని వర్సిటీ నిర్ణయించింది. ఆచార్యులపై వార్షిక రహస్య నివేదిక(ఏసీఆర్‌)లు సమర్పించాలని వర్సిటీ విభాగాధిపతులు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. లక్షకుపైగా ఉన్న విలువైన స్థిర చరాస్తుల వివరాలు వచ్చేనెల 20లోగా ప్రకటించాలని కోరారు. ఈ వ్యవహారంపై వర్సిటీ ఆచార్యులు మండిపడుతున్నారు. ఏసీఆర్‌లు తీసుకునేందుకు తాము ప్రభుత్వ అధికారులు కాదని స్పష్టం చేస్తున్నారు. అయితే జనవరిలో ఏసీఆర్‌లు సమర్పించాల్సి ఉంటుందని యూనివర్సిటీ ప్రకటించింది. ఇందులో వర్సిటీ ఆచార్యుల పనితీరు సహా సమగ్ర అంశాలను సంబంధిత విభాగాధిపతులు, ప్రిన్సిపాల్స్‌ నేరుగా వర్సిటీకి సమర్పించాలి.

వర్సిటీలో కలకలం..  ఈ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ టీచర్స్‌ అసోసియేషన్‌(ఔటా) ఉపకులపతికి లేఖ రాసింది. పరిపాలన, అకడమిక్‌ కార్యకలాపాలకు ప్రధాన అధికారిగా ఉపకులపతి వ్యవహరిస్తారని, ఆచార్యులు ఆయన కింద పనిచేసే ఉద్యోగులు(సబార్డినేట్స్‌) కారని ఔటా లేఖలో పేర్కొంది.  ఏసీఆర్‌ రాసే అధికారం ఉపకులపతికే ఉండదని, అలాంటి పరిస్థితుల్లో ఉపకులపతి నియమించిన ప్రిన్సిపల్‌ లేదా విభాగాధిపతులకు ఎలా ఉంటుందని ప్రశ్నించింది. కళాశాలల ప్రిన్సిపాల్స్‌గా తక్కువ సర్వీసు ఉన్న ఆచార్యులు పనిచేస్తున్నారు. వారు సీనియర్లపై నివేదిక ఇవ్వడం సమంజసం కాదని చెబుతున్నారు. ‘‘ఉపకులపతి ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సీపీఎస్‌ దస్త్రం పెండింగులో ఉంది. దీన్ని పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలి’’ అని ఔటా అధ్యక్షుడు ప్రొ.బి.మనోహర్‌ కోరారు.

Read latest Medchal News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని