logo

గురుకులాల్లో క్యాబ్‌ డ్రైవర్ల పిల్లలకు 10 శాతం సీట్లు

క్యాబ్‌ డ్రైవర్ల పిల్లలకు గురుకుల పాఠశాలల్లో 10శాతం సీట్లు కేటాయించేలా కృషి చేస్తానని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. బోయిన్‌పల్లి ఓల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ రోడ్డులోని తెలంగాణ

Published : 08 Dec 2021 03:07 IST

గుర్తింపు కార్డులు అందజేస్తున్న మంత్రి మల్లారెడ్డి

కార్ఖానా, న్యూస్‌టుడే: క్యాబ్‌ డ్రైవర్ల పిల్లలకు గురుకుల పాఠశాలల్లో 10శాతం సీట్లు కేటాయించేలా కృషి చేస్తానని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. బోయిన్‌పల్లి ఓల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ రోడ్డులోని తెలంగాణ గార్డెన్‌లో మంగళవారం కనెక్టెడ్‌ క్యాబ్స్‌ అండ్‌ డ్రైవర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రథమ వార్షికోత్సవాలకు ఎమ్మెల్యే సాయన్న, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌, మర్రి రాజశేఖర్‌రెడ్డిలతో కలిసి ఆయన హాజరయ్యారు. కార్యక్రమంలో కనెక్టడ్‌ క్యాబ్స్‌ ఆండ్‌ డ్రైవర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్‌, ఉపాధ్యక్షుడు గిరిబాబు, ప్రధాన కార్యదర్శి చంద్రకిరణ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉపేంద్ర, టీఆర్‌ఎస్‌కేవీ ఉపాధ్యక్షుడు మారయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని