logo

విద్యతోనే ప్రగతి, గౌరవం

విద్యతోనే అభివృద్ధి, సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని వెస్లీ బాలుర జూనియర్‌ కళాశాల గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి.

Published : 08 Dec 2021 03:07 IST

వెస్లీ బాలుర జూనియర్‌ కళాశాల స్వర్ణోత్సవాల్లో తలసాని

స్వర్ణోత్సవాల పోస్టల్‌ స్టాంపును, సావనీర్‌ విడుదల చేస్తున్న మంత్రి తలసాని

బన్సీలాల్‌పేట్‌, న్యూస్‌టుడే: విద్యతోనే అభివృద్ధి, సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని వెస్లీ బాలుర జూనియర్‌ కళాశాల గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన తలసాని మాట్లాడుతూ..వెస్లీ కళాశాలలో విలువలతో కూడిన విద్యతోపాటు క్రీడల్లోనూ ఎంతో ప్రోత్సహించేవారని, ఎంతోమంది అంతర్జాతీయ క్రీడాకారులు ఇక్కడినుంచి వచ్చారని గుర్తుచేశారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యకు అధిక ప్రాధాన్యమిస్తూ అనేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. అనంతరం గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల పోస్టల్‌ స్టాంపు, సావనీర్‌ను మంత్రి విడుదల చేశారు. ప్రిన్సిపల్‌ డా.మోజస్‌పాల్‌, సీఎస్‌ఐ మెదక్‌ డయాసిస్‌ వైస్‌ఛైర్మన్‌ రెవరెండ్‌ భాస్కర్‌, డిగ్రీ, పీజీ కళాశాలల డైరెక్టర్‌ విమల్‌సుకుమార్‌, డయాసిస్‌ ప్రతినిధులు చార్లెస్‌ వెస్లీ, సత్యానందం, ఎం డేవిడ్‌, డేనియల్‌, రెవరెండ్‌ ప్రసన్నకుమార్‌, ప్రేమ్‌కుమార్‌, పూర్వ విద్యార్థులు అల్లాడి రవి పాల్గొన్నారు.

సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థిని అభినయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని