logo

నగరంలోనే దేబేంద్ర అంత్యక్రియలు

బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 2లో ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరూ పొట్ట కూటి కోసం నగరానికి వచ్చినవారే. చిరు ఉద్యోగాలు చేస్తూ కొంత మొత్తం కుటుంబ సభ్యులకు పంపేవారు

Updated : 08 Dec 2021 06:24 IST

అయోధ్యరాయ్‌ మృతదేహం సొంతూరికి
 

అయోధ్య రాయ్‌, దేబేంద్ర

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 2లో ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరూ పొట్ట కూటి కోసం నగరానికి వచ్చినవారే. చిరు ఉద్యోగాలు చేస్తూ కొంత మొత్తం కుటుంబ సభ్యులకు పంపేవారు. వారి మరణంతో ఆ కుటుంబాలు ఆసరా కోల్పోయాయి. ఒడిశాలో జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా గోపాల్‌పురానికి చెందిన దేబేంద్ర కుమార్‌ దాస్‌(29)కు గతేడాది మార్చిలో వివాహమైంది. ఉపాధి నిమిత్తం వచ్చి బంజారాహిల్స్‌లోని గౌరిశంకర్‌ కాలనీ నివసిస్తున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అయోధ్యరాయ్‌(23) మూడేళ్ల క్రితం వచ్చి నందినగర్‌లో నివసిస్తున్నాడు. ఇద్దరు క్యూబ్‌ అనే సంస్థ ద్వారా రెయిన్‌బో ఆసుపత్రి వంట విభాగంలో పనిచేస్తున్నారు. దేబేంద్ర తల్లికి అనారోగ్యంగా ఉండటంతో అతని భార్య ఆమెను చూసుకుంటూ ఊరిలోనే ఉంటుంది. ఒకే ప్రాంతంలో పనిచేస్తుండటంతో దేబేంద్ర, అయోధ్య  కలిసిమెలిసి ఉండేవారు. ఆదివారం రాత్రి టీ తాగడానికి వెళ్లి మృత్యువాతపడ్డారు. దేబేంద్రను కడసారి చూడటానికి భార్య ఇక్కడికి రాలేకపోయారు. సోదరుడు బజేంద్రకుమార్‌ పురానాపూల్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. భార్య, తల్లికి వీడియోకాల్‌ ద్వారా కార్యక్రమాన్ని చూపించారు. అయోధ్యరాయ్‌ పంపే జీతమే కుటుంబానికి ఆధారం. వరుసకు బాబాయి, ఆసుపత్రిలోనే పనిచేసే రాంపర్వేశ్‌ అయోధ్యరాయ్‌ మృతదేహాన్ని స్వస్థలం తీసుకెళ్లారు. ఎంతో కలుపుగోలుగా ఉండే వీరి మృతితో స్నేహితులు, తోటి ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని