logo

నేడు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్‌

నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 6 నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో భాగంగా సంతోష్‌నగర్‌

Published : 08 Dec 2021 03:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 6 నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో భాగంగా సంతోష్‌నగర్‌ వద్ద తాగునీటి పైపులైన్లు పక్కకు మార్చనున్న నేపథ్యంలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని పేర్కొంది. ఈ మేరకు మిరాలం, కిషన్‌బాగ్‌, ఆల్‌జుబైల్‌ కాలనీ, సంతోష్‌నగర్‌, వినయ్‌నగర్‌, సైదాబాద్‌, చంచల్‌గూడ, అస్మాన్‌గఢ్‌, యాకుత్‌పురా, మాదన్నపేట, మహబూబ్‌ మాన్షన్‌, రియాసత్‌నగర్‌, ఆలియాబాద్‌, బొగ్గులకుంట, అఫ్జల్‌గంజ్‌, నారాయణగూడ, అడిక్‌మెట్‌, శివం, నల్లకుంట, చిలకలగూడ, దిల్‌సుఖ్‌నగర్‌, బొంగుళూరు, మన్నెగూడ రిజర్వాయర్ల పరిధిలో సరఫరా ఉండదని, ప్రజలు గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించింది.

పెద్దఅడిశర్లపల్లి: జంటనగరాల తాగునీటి అవసరాలు తీర్చేందుకు నిరంతర పనిచేస్తున్న ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) పుట్టంగండి ఎత్తిపోతల పథకం మోటార్లకు మంగళవారం మరమ్మతులు మొదలయ్యాయి. బ్యాటరీలు కాలంచెల్లడంతో వాటిస్థానంలో నూతన బ్యాటరీలు ఏర్పాటు చేస్తున్నారు. పదిరోజులు మరమ్మతులు కొనసాగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని