logo

గొల్లుమంటున్న.. గొల్ల చెరువు!

నిత్యం తీరిక లేకుండా గడుపుతున్న పట్టణ వాసులకు ప్రశాంత వాతావరణం కల్పించేందుకు తాండూరు పట్టణం గొల్ల చెరువును రూ.4 కోట్లతో మినీ ట్యాంకు బండ్‌గా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగానే బతుకమ్మ ఘాట్‌, నడక మార్గం పనులు పూర్తిచేశారు.

Published : 17 Jan 2022 03:27 IST

న్యూస్‌టుడే, తాండూరు టౌన్‌: నిత్యం తీరిక లేకుండా గడుపుతున్న పట్టణ వాసులకు ప్రశాంత వాతావరణం కల్పించేందుకు తాండూరు పట్టణం గొల్ల చెరువును రూ.4 కోట్లతో మినీ ట్యాంకు బండ్‌గా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగానే బతుకమ్మ ఘాట్‌, నడక మార్గం పనులు పూర్తిచేశారు. అయితే మురుగు చేరకుండా చర్యలు తీసుకోవడంలేదు. రాఘవేంద్ర కాలనీ, వాల్మికినగర్‌, సీసీఐ కాలనీ, మల్‌రెడ్డిపల్లి, తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మురుగంతా చెరువులోకి పారుతోంది. ఆహ్లాదానికి వస్తే దుర్వాసనతో ముక్కుపుటాలు అదురుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. గుర్రపు డెక్క విస్తరించినా తొలగించే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. మురుగు నీరు రాకుండా ప్రత్యామ్నాయ మార్గం ద్వారా మళ్లిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రభుత్వ లక్ష్యం, ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే సమన్వయంతో ముందుకు సాగితేనే ఫలితం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని