logo

ప్రేయసి మృతిపై ఆవేదనతో ఆత్మహత్య

ప్రేమించిన అమ్మాయి మృతి చెందడంతో ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు యువకుడు. ఈ ఘటన దుబ్బాక పురపాలికలోని ధర్మాజీపేట 8వ వార్డులో శనివారం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్‌ఐ మన్నె స్వామి తెలిపిన వివరాలు.. ధర్మాజిపేటకు చెందిన

Published : 17 Jan 2022 05:01 IST

దుబ్బాక, న్యూస్‌టుడే: ప్రేమించిన అమ్మాయి మృతి చెందడంతో ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు యువకుడు. ఈ ఘటన దుబ్బాక పురపాలికలోని ధర్మాజీపేట 8వ వార్డులో శనివారం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్‌ఐ మన్నె స్వామి తెలిపిన వివరాలు.. ధర్మాజిపేటకు చెందిన బూరు దేవరాజు(20)కు చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. ఇంటర్‌ వరకు చదివి, ప్రస్తుతం భవన నిర్మాణ కూలీ పనులు చేస్తూ తల్లితో కలిసి జీవిస్తున్నాడు. ధర్మాజీపేటలోని ఓ అమ్మాయితో కొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్నాడు. రెండు నెలల క్రితం ఆమె అనారోగ్యంతో మరణించింది. అప్పటి నుంచి తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు. శుక్రవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. గ్రామస్థుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. తల్లి భాగ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.


అనారోగ్య సమస్యతో యువకుడు...

బెజ్జంకి, న్యూస్‌టుడే: అనారోగ్య సమస్యతో మనో వేదనకు గురైన యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన లక్ష్మీపూర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. ఏఎస్‌ఐ వహీద్‌ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నల్లగొండ జయాకర్‌ (30) డ్రైవర్‌, కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నాలుగేళ్ల క్రితం తలనొప్పి రావడంతో పరీక్షించుకోగా కొద్ది మొత్తంలో రక్తం గడ్డ కట్టిందని తేలడంతో వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో రెండు నెలలుగా తలనొప్పి ఎక్కువ కావడంతో మరింత వేదనకు గురయ్యాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు