logo

కంపెనీ కార్యదర్శులు చిత్తశుద్ధి కలిగి ఉండాలి

కంపెనీ సెక్రెటరీలు కార్పొరేట్లు, వాటాదారుల ప్రయోజనాలను కాపాడటంలో పారదర్శకత, నిజాయతీ, చిత్తశుద్ధి కలిగి ఉండాలని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ సభ్యులు, న్యాయమూర్తి డా.వీఆర్‌ భద్రీనాథ్‌ నందుల, హైదరాబాద్‌ కంపెనీస్‌

Published : 17 Jan 2022 05:33 IST


పత్రాలు మార్చుకుంటున్న ఐసీఎస్‌ఐ-తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రతినిధులు

సోమాజిగూడ, న్యూస్‌టుడే: కంపెనీ సెక్రెటరీలు కార్పొరేట్లు, వాటాదారుల ప్రయోజనాలను కాపాడటంలో పారదర్శకత, నిజాయతీ, చిత్తశుద్ధి కలిగి ఉండాలని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ సభ్యులు, న్యాయమూర్తి డా.వీఆర్‌ భద్రీనాథ్‌ నందుల, హైదరాబాద్‌ కంపెనీస్‌ రిజిస్ట్రార్‌ జోసేకుట్టి అన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రెటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) హైదరాబాద్‌ చాప్టర్‌ సహకారంతో ఐసీఎస్‌ఐ దక్షిణ భారత శాఖ ఆధ్వర్యంలో 13వ ప్రాక్టీసింగ్‌ కంపెనీ సెక్రెటరీల సదస్సు శనివారం సోమాజిగూడలోని ది పార్కు హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ.. కంపెనీ సెక్రెటరీలు ధర్మాన్ని కాపాడాలని, అప్పుడు ధర్మం వారిని కాపాడుతుందని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ.డి.రవీందర్‌ సమక్షంలో ఐసీఎస్‌ఐతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని వీసీ తెలిపారు. కార్యక్రమంలో దక్షిణ భారత ఐసీఎస్‌ఐ అధ్యక్షులు నాగేంద్ర డి.రావు, సెంట్రల్‌ కౌన్సిల్‌ సభ్యులు డా.వి.ఆహ్లాదరావు, ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ ఆర్‌.వెంకటరమణ, ఐసీఎస్‌ఐ హైదరాబాద్‌ చాప్టర్‌ ఛైర్మన్‌ నవజ్యోత్‌ పుట్టపర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు