logo

జైపాల్‌రెడ్డి సేవలు చిరస్మరణీయం

కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు నేతలు కొనియాడారు. జపాల్‌రెడ్డి 80వ జయంతిని పురస్కరించుకొని నెక్లెస్‌ రోడ్డు స్ఫూర్తి స్థల్‌ వద్ద జైపాల్‌రెడ్డి సమాధిని ఆదివారం పలువురు నేతలు సందర్శించారు.

Published : 17 Jan 2022 05:33 IST


నివాళి అర్పిస్తున్న రేవంత్‌రెడ్డి దంపతులు, నేతలు అంజన్‌కుమార్‌, మల్లు రవి తదితరులు

బన్సీలాల్‌పేట్‌, న్యూస్‌టుడే: కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు నేతలు కొనియాడారు. జపాల్‌రెడ్డి 80వ జయంతిని పురస్కరించుకొని నెక్లెస్‌ రోడ్డు స్ఫూర్తి స్థల్‌ వద్ద జైపాల్‌రెడ్డి సమాధిని ఆదివారం పలువురు నేతలు సందర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దంపతులతో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, నేతలు వీహెచ్‌, మధుయాష్కీ, సంపత్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, మల్లురవి, వివేక్‌, కోదండరాం తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, జైపాల్‌రెడ్డి లేకపోయినా ఆయన సాధించిన తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నామన్నారు. రాజకీయాలంటే పార్టీ ఫిరాయింపులు, కొనుగోళ్లు, కాంట్రాక్టులుగా కేసీఆర్‌ చేశారని, జైపాల్‌రెడ్డి స్ఫూర్తిని తాము కొనసాగిస్తామని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో మచ్చలేని నాయకులలో జైపాల్‌రెడ్డి ఒకరని అన్నారు. ఆయన జయంతి రోజు సీఎం కనీసం నివాళులు అర్పించలేదని అన్నారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్‌, మాజీ ఎమ్మెల్యే సంపత్‌లు మాట్లాడుతూ, జైపాల్‌రెడ్డి కేంద్రమంత్రిగా రాష్ట్రానికి ఎన్నో సేవలు చేశారని గుర్తు చేశారు. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ జైపాల్‌రెడ్డి లేకపోవడం తెలంగాణ సమాజానికి తీరని నష్టమని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని