logo

317తో స్థానికత కోల్పోయే ప్రమాదం

నిబద్ధమైన పాలన కోసం సీఎం కేసీఆర్‌ను ఉద్యోగులు నిలదీయాల్సిన అవసరముందని తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలో సోమవారం 317 జీవో రద్దుపై నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌

Updated : 18 Jan 2022 05:13 IST

తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్‌

మాట్లాడుతున్న తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్‌

జహీరాబాద్‌ అర్బన్‌: నిబద్ధమైన పాలన కోసం సీఎం కేసీఆర్‌ను ఉద్యోగులు నిలదీయాల్సిన అవసరముందని తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలో సోమవారం 317 జీవో రద్దుపై నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బదిలీ పేరుతో తెరాస ప్రభుత్వం రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోందని ఆరోపించారు. అశాస్త్రీయంగా ఉద్యోగులతో చర్చించకుండా తీసుకొచ్చిన జీఓతో ఉద్యోగులు స్థానికత కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఉద్యోగుల సర్దుబాటు చేపడితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగుల నిష్పత్తి కాపాడాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేలా రూపొందించిన ఉత్తర్వులను రద్దు చేసి బదిలీల ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు కార్యచరణ రూపొందిస్తామని అన్నారు. సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, తెజస నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని