logo

Hyderabad News: బుక్‌ చేసుకున్న రెండు గంటల్లోనే గ్యాస్‌ సిలిండర్‌: ఇండేన్‌

గ్యాస్‌ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా తత్కాల్‌ సేవ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ఇండేన్‌ కంపెనీ సోమవారం ప్రకటించింది. ఒకే సిలిండర్‌ ఉన్న వినియోగదారులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని సూచించింది. ఇందులో

Updated : 18 Jan 2022 07:04 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్యాస్‌ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా తత్కాల్‌ సేవ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ఇండేన్‌ కంపెనీ సోమవారం ప్రకటించింది. ఒకే సిలిండర్‌ ఉన్న వినియోగదారులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని సూచించింది. ఇందులో భాగంగా బుక్‌ చేసుకున్న రెండు గంటల్లోనే వినియోగదారులు సిలిండర్‌ పొందవచ్చని కంపెనీ జనరల్‌ మేనేజర్‌ వి.వెట్రీసెల్వకుమార్‌ తెలిపారు. ఇందుకు అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సదుపాయం కోసం ఫోన్‌ లేదా ఇండేన్‌ ఆయిల్‌వన్‌ యాప్‌,  https://cx.indianoil.in వెబ్‌సైట్‌లో బుకింగ్‌ చేసుకోవచ్చని సూచించారు. నగరవ్యాప్తంగా ఉన్న 62 ఇండేన్‌ డిస్ట్రిబ్యూటర్ల వద్ద సదుపాయం అందుబాటులో ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని