logo

ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ చిత్రం మార్ఫింగ్‌

ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ చిత్రాన్ని మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్నారంటూ ఓ సామాజికవేత్త, న్యూ

Published : 18 Jan 2022 02:24 IST

నారాయణగూడ, కేశవగిరి, న్యూస్‌టుడే: ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ చిత్రాన్ని మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్నారంటూ ఓ సామాజికవేత్త, న్యూ మలక్‌పేటకు చెందిన షేక్‌ మొహియుద్దీన్‌ అబ్రార్‌ సోమవారం హైదరాబాద్‌ సైబర్‌ కైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ కథనం ప్రకారం.. ఎంపీ అసదుద్దీన్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో కలిసి కూర్చొని మాట్లాడుతున్నట్లు మార్ఫింగ్‌ చేసిన చిత్రం వైరల్‌ అయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న సైబర్‌ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇదే విషయమై చాంద్రాయణగుట్ట ఠాణాలోనూ కేసు నమోదైంది. ఉప్పుగూడ కార్పొరేటర్‌ ఫాహద్‌ అబ్దాత్‌, మాజీ కార్పొరేటర్‌ సమద్‌ అబ్దాత్‌, మజ్లిస్‌ నేతలు డీఐ ఎస్‌.వీరయ్యకు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని