logo

పెనాల్టీ ఛార్జీలు చెల్లించండి: వినియోగదారుల కమిషన్‌

పోస్ట్‌ డేటెడ్‌ చెక్కును గమనించకుండా ఇష్టానుసారం ప్రాసెస్‌ చేయడంతో పాటు చెక్‌ బౌన్స్‌ పెనాల్టీ ఛార్జీలు వసూలు చేయడంపై బీకేగూడకు చెందిన బి.కోటేశ్వర్‌రావు కమిషన్‌లో

Published : 18 Jan 2022 02:24 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: పోస్ట్‌ డేటెడ్‌ చెక్కును గమనించకుండా ఇష్టానుసారం ప్రాసెస్‌ చేయడంతో పాటు చెక్‌ బౌన్స్‌ పెనాల్టీ ఛార్జీలు వసూలు చేయడంపై బీకేగూడకు చెందిన బి.కోటేశ్వర్‌రావు కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బల్కంపేట శాఖలో కరెంట్‌ ఖాతాదారు. నగదు లావాదేవీల్లో భాగంగా పోస్ట్‌డేటెడ్‌ చెక్‌తో పాటు మరో రెండు చెక్కులు  అదే రోజు చెల్లుబాటు అయ్యేలా ప్రతివాద బ్యాంకుకు పంపించారు.  దానిని గమనించని ప్రతివాద ఎస్‌బీఐ బ్యాంకు సిబ్బంది అదే రోజున పోస్ట్‌డేటెడ్‌ చెక్కును ప్రాసెస్‌ చేశారు. దీంతో చెక్కు బౌన్స్‌ అయ్యింది. దీనిపై కమిషన్‌ విచారణ నిర్వహించగా.. కొన్ని సాంకేతిక పొరపాట్ల వల్ల ఈ చెక్కులకు పెనాల్టీ పడిందని బ్యాంకువర్గాలు వివరించాయి. దీనిపై కమిషన్‌ తీర్పునిస్తూ చెల్లిన చెక్కులకు విధించిన పెనాల్టీ రూ.1,157 తిరిగి వినియోగదారుకు చెల్లించాలని ఎస్బీఐకి సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని