logo

భారీ చోరీ దొంగ దొరికాడు!

రాజీవ్‌నగర్‌లోని శ్రీసాయి నివాస్‌ అపార్ట్‌మెంట్‌లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన మంచిర్యాలకు చెందిన పాత నేరస్థుడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 12వ

Published : 18 Jan 2022 02:24 IST

రాజీవ్‌నగర్‌ కేసును ఛేదించిన పోలీసులు

అమీర్‌పేట, న్యూస్‌టుడే: రాజీవ్‌నగర్‌లోని శ్రీసాయి నివాస్‌ అపార్ట్‌మెంట్‌లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన మంచిర్యాలకు చెందిన పాత నేరస్థుడిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 12వ తేదీన రాత్రి తాళం వేసి ఉన్న  ఫ్లాట్‌లో సుమారు 2 కిలోల బంగారు నగలు, రూ.25లక్షల నగదు చోరీ జరిగిన విషయం తెలిసిందే. భారీగా నగలు, నగదు మాయం కావడంతో కేసును పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. ఎస్సార్‌నగర్‌ పోలీసులతో పాటు రెండు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు రంగంలోకి దిగాయి. చోరీ జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు మంచిర్యాలకు చెందిన పాత నేరస్థుడు ఒక్కడే ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దొంగను పట్టుకునే క్రమంలో తొలుత అతని సోదరుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతని ద్వారా అసలు దొంగను అదుపులోకి తీసుకున్నారు. రాజీవ్‌ నగర్‌లో చోరీకి ముందు అక్కడి మరి కొన్ని ఇళ్లలో నిందితుడు దొంగతనానికి విఫలయత్నం చేశాడు. కేసు వివరాలను పోలీసులు మంగళవారం మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని