logo

క్యాన్సర్‌ కణాల విస్తరణలో కీలక ముందడుగు

క్యాన్సర్‌ కణాల నియంత్రణలో బాహ్య కణ మాతృక(ఎక్స్‌ట్రా సెల్యులార్‌ మ్యాట్రిక్స్‌) కీలకపాత్ర పోషిస్తున్నట్లు టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌(టీఐఎఫ్‌ఆర్‌) పరిశోధకులు

Published : 18 Jan 2022 02:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: క్యాన్సర్‌ కణాల నియంత్రణలో బాహ్య కణ మాతృక(ఎక్స్‌ట్రా సెల్యులార్‌ మ్యాట్రిక్స్‌) కీలకపాత్ర పోషిస్తున్నట్లు టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌(టీఐఎఫ్‌ఆర్‌) పరిశోధకులు గుర్తించారు. నగరంలోని టీఐఎఫ్‌ఆర్‌ ఆచార్యుడు తమల్‌దాస్‌ నేతృత్వంలో పీహెచ్‌డీ విద్యార్థిని శిల్ప పి.పొతప్రగడ క్యాన్సర్‌ కారకాలపై ప్రత్యేక అధ్యయనం నిర్వహించారు. ఇందులో అవయవాలు, చర్మంపై ఉండే ప్రత్యేక పొర(ఎపిథిలియల్‌ కణజాలం)లోని బాహ్య కణ మాతృక క్యాన్సర్‌ కణాలను సమర్థంగా ఎదుర్కొంటోందని తేల్చారు. వీరి పరిశోధన ప్రఖ్యాత నేచర్‌ జర్నల్‌ జనవరిలో ప్రచురితమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని