TS News: తుది తీర్పునకు లోబడే ఉపాధ్యాయుల కేటాయింపులు: హైకోర్టు

కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులు తుది తీర్పునకు లోబడి ఉండాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు దాఖలు

Published : 18 Jan 2022 19:15 IST

హైదరాబాద్‌: కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులు తుది తీర్పునకు లోబడి ఉండాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్లపై సీజే జస్టిస్‌ సతీశ్‌ చంద్రశర్మ, జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది. జీవో 317పై స్టే ఇవ్వాలని ఉపాధ్యాయుల తరఫు న్యాయవాదులు కోరారు. కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగులు విధుల్లో చేరారని.. అదనపు ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ కోర్టుకు తెలిపారు. జీవో 317పై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం.. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేటాయింపులన్నీ పిటిషన్లపై తుది తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేస్తూ విచారణ ఏప్రిల్‌ 4కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని