logo

రోడ్డు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు: ఎస్పీ

జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపడతామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మంగళవారం రహదారి భద్రతపై రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి దృశ్య, శ్రవణ విధానం (వీడియో కాన్ఫరెన్స్‌) ద్వారా నిర్వహించిన

Published : 19 Jan 2022 02:43 IST


డీజీపీ సమావేశంలో పాల్గొన్న ఎస్పీ కోటిరెడ్డి, ఏఎస్పీ రషీద్‌

వికారాబాద్‌, న్యూస్‌టుడే: జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపడతామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. మంగళవారం రహదారి భద్రతపై రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి దృశ్య, శ్రవణ విధానం (వీడియో కాన్ఫరెన్స్‌) ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఏఎస్పీ రషీద్‌తో కలిసి పాల్గొన్నారు. జిల్లాలో తరచూ రహదారి ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. పరిగి మీదుగా జాతీయ రహదారి (163) ఉందని అధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ‘బ్లాక్‌ స్ఫాట్స్‌’గా గుర్తించి హెచ్చరిక బోర్డులు, పొదల తొలగింపు, రేడియం స్టిక్కర్లు, రేడియం బ్లింకర్లను ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. ప్రమాదం జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను, వేగ నియంత్రణ (స్పీడ్‌ గన్‌)లను ఏర్పాటుచేస్తామని చెప్పారు.  

సీసీ కెమెరాలు ఎంతో దోహదం
మోమిన్‌పేట: శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి అన్నారు, మంగళవారం మండల పరిధిలోని టేకులపల్లిలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ ప్రారంభించి అనంతరం మాట్లాడారు. కెమెరాలు ఉన్న గ్రామాలలో నేరాలు తగ్గు ముఖం పట్టాయన్నారు. కార్యక్రమంలో మోమిన్‌పేట వలయాధికారి వెంకటేశం ఎస్సై విజయ్‌ ప్రకాష్‌ గ్రామ సర్పంచి నవనీతారెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని