logo

నెలాఖరులోపు వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి

రంగారెడ్డి జిల్లాలో నెలాఖరులోగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై మంగళవారం నగరంలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో

Published : 19 Jan 2022 03:59 IST


వ్యాక్సినేషన్‌పై అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి సబితారెడ్డి. చిత్రంలో కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలో నెలాఖరులోగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై మంగళవారం నగరంలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు 27.21 లక్షల మంది మొదటి డోసు, 19.74 లక్షల మంది రెండో డోసు వేసుకున్నారన్నారు. 15-18 ఏళ్ల మధ్య 1.77 లక్షల మందికి టీకాలు వేయాల్సి ఉండగా.. 84 వేల మందికి వేసినట్లు చెప్పారు. బూస్టర్‌ డోసు 4 వేల మందికి వేసినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు, డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య : కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల బాగు కోసం మన ఊరు-మన బడి పథకాన్ని అమలు చేసేందుకు రూ.7289 కోట్లు ఖర్చు చేయబోతున్నామని అన్నారు. పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు పైలెట్‌ ప్రాజెక్టుగా రాష్ట్రంలో నాలుగు పాఠశాలలు ఎంపిక చేసినట్లు చెప్పారు.  సమావేశంలో టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, ఎండీ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు
వానాకాలంలో పండిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు అధికారులు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై మంగళవారం తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు 41,151 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 38 కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని