logo

అధిక జీతం ఆశచూపి.. అమ్మేశారు

ఏజెంట్లు చెప్పిన మాటలు నమ్మి ఉద్యోగం ఆశతో ఒమన్‌ దేశానికి వెళ్లిన మహిళ ఎట్టకేలకు తిరిగి నగరానికి చేరుకుందని ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లా ఖాన్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు..

Published : 19 Jan 2022 03:59 IST

చంచల్‌గూడ, న్యూస్‌టుడే: ఏజెంట్లు చెప్పిన మాటలు నమ్మి ఉద్యోగం ఆశతో ఒమన్‌ దేశానికి వెళ్లిన మహిళ ఎట్టకేలకు తిరిగి నగరానికి చేరుకుందని ఎంబీటీ అధికార ప్రతినిధి అమ్జదుల్లా ఖాన్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. గత నవంబర్‌లో రంగారెడ్డి జిల్లా షాహీన్‌నగర్‌కు చెందిన మహిళకు ఒమన్‌లో అధిక జీతం వస్తుందని ఏజెంట్లు ఆశచూపడంతో వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక ఆమెను ఒమన్‌లో కాకుండా పట్టణానికి దూరంగా మేకలు కాసే పనిలో చేర్చారు. నిత్యం 18గంటల పాటు పనులు చేయించడంతో ఆరోగ్యం పాడైంది. స్వదేశం వెళ్లేందుకు అనుమతించాలని యజమానిని కోరగా.. రు.2లక్షలకు ఏజెంట్లు తనకు విక్రయించినట్లు తెలిపాడు. ఇరుగు పొరుగు వారిని బతిమిలాడి వారి ద్వారా నగరంలోని కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసింది. దీంతో వారు ఎంబీటీ అధికార ప్రతినిధిని కలిసి సాయం చేయమని కోరారు. ఆయన భారత విదేశాంగ మంత్రికి, మస్కత్‌లో ఉన్న ఇండియన్‌ ఎంబసీకి తెలిపి  సదరు మహిళను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని